సేవా సంకల్ప్ అభియాన్ చిత్రలేఖన పోటీలో మేఘనకు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి
లక్క వరపు కోట , అక్టోబర్ 1 మేజర్ న్యూస్ :
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీల్లో లక్క వరపు కోట మండలం జమ్మదేవి పేట గ్రామ కేంద్రం గా నిర్వహిస్తున్న కొత్తవలస మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి గండిమని మేఘన ప్రతిభ చాటింది.
జూనియర్ ఇంటర్ బైపీసీ చదువుతున్న మేఘన జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.అని ప్రిన్సిపాల్ యూ విజయ్ కుమార్ పాత్రో తెలిపారు
మేఘనకు ఆంగ్ల అధ్యాపకురాలు కోటా దేవి మార్గదర్శకత్వం వహించారుఅని ప్రిన్సిపాల్ తెలిపారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యు. విజయ్ కుమార్ పాత్రో మాట్లాడుతూ, మేఘన సాధించిన విజయం గురుకులానికి గర్వకారణమని, ఆమెతో పాటు ప్రోత్సహించిన అధ్యాపకురాలు కోటా దేవిని అభినందించారు.
మేఘనను అధ్యాపకులు, విద్యార్థినులు అభినందించి, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.