సీపీఎం నేత రాంభూపాల్‌ను కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సి. రమేష్ గౌడ్ మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాంభూపాల్‌తో పాటు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర, సీపీఎం జిల్లా అధ్యక్షుడు ఆర్.వీ. నాయుడు తదితర నాయకులను రమేష్ గౌడ్ కలుసుకున్నారు. ఈ భేటీ నగర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులను కలుస్తూ రమేష్ గౌడ్ తన పరిచయాలను విస్తరించుకుంటున్నారు. ఎన్నికల్లో వివిధ వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న రమేష్ గౌడ్ తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకునేందుకు నాయకులతో సంప్రదింపులు జరుపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.