BREAKING
వెలికట్ట క్రాస్ రోడ్డులో యువకులపై కత్తితో దాడి ఆనందపురం-1 ఎంపీటీసీకి జనసేన తరఫున రామలక్ష్మి నామినేషన్‌ టిడిపిలోకి కొనసాగుతన్న వైసిపి నుంచ వలసలు సిఎస్ పురం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా శ్రీనివాసవర్మ నామినేషన్ కొడంగల్‌లో జర్నలిస్టులకు అవమానం.. సీఎం సభలో మీడియా ప్రతినిధులకు తప్పని ఇబ్బందులు స్టోర్ రూమ్ రిజిస్టర్ తనిఖీ చేసిన కమిషనర్ కోలాహలంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా ఎం హరితమ్మ. జడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంటేరు వైయస్సార్సీపి నుంచి 18 , టిడిపి నుంచి 12 దాఖలు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మెగాన్ షుట్‌కు షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన క్రికెట్ బోర్డు వైసీపీ నేతల ఇంటింటా ప్రచారం గుర్ల లోరెండో రోజు 51 నామినేషన్లు దాఖలు టీజీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేటలో ఆంక్షలు పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు నామినేషన్ కేంద్రంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేయండి

సర్వమత ప్రార్థనల అనంతరం ఎంపీటీసీగా ఎంపీపీ అభ్యర్థి నామినేషన్

Select Suryaa Now
సర్వమత ప్రార్థనల అనంతరం ఎంపీటీసీగా ఎంపీపీ అభ్యర్థి నామినేషన్

పాములపాడు:మేజర న్యూస్ మండల పరిధిలోని వెంపెంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టేకురి రామసుబ్బమ్మ, సామాజికవేత్త టేకురి నాగేశ్వరరావు సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ముందుగా జూటూరు మజరా గ్రామమైన కోల్స్ ఆనందపురంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జూటూరు పీర్ల చావడి వద్ద ప్రార్థనలు చేసి, సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

అనంతరం మండల కేంద్రమైన పాములపాడుకు చేరుకుని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు పార్టీ న్యాయం చేసిందని తెలిపారు. ఎంపీటీసీగా ఎన్నికైతే మండల అభివృద్ధికి కృషి చేస్తామని టేకురి రామసుబ్బమ్మ, టేకురి నాగేశ్వరరావు పేర్కొన్నారు.