BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

సైనికుడిగా సాగిన ప్రస్థానానికి ఘనమైన సెల్యూట్..!

Select Suryaa Now
సైనికుడిగా సాగిన ప్రస్థానానికి ఘనమైన సెల్యూట్..!

నరసన్నపేట, సూర్య : మాతృభూమి రక్షణే పరమావధిగా భావించి, సరిహద్దుల్లో రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ దేశ ప్రజల ప్రశాంత జీవనం కోసం సేవలందించిన సైనికుల జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు పాగోటి రామకృష్ణ పేర్కొన్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా విశేష సేవలందించి పదవీ విరమణ అనంతరం మంగళవారం స్వగ్రామమైన నర్సింగపల్లికి చేరుకున్న పాగోటి సన్యాసిరావుకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, అనంతరం రచ్చబండ వద్ద గ్రామస్థుల ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు పాగోటి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశ సేవకు అంకితమైన సైనికుడి ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ ఉంటుందని, దేశం పట్ల బాధ్యతకు ఎప్పటికీ విరామం ఉండదని అన్నారు. సైనికుడిగా దేశానికి అందించిన సేవల అనంతరం తన అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని ఆకాంక్షించారు. ఆయన అనుభవం యువతకు మార్గదర్శకంగా నిలవాలని, ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తినివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సన్యాసిరావు స్నేహితులు, బంధువులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు.