రోటరీ ఆద్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
గూడూరు, మేజర్‌న్యూస్ : సమాజంలో ఉపాద్యాయుల పాత్ర ఎంతో ప్రధానమైనదని పురపాలక కమిషనర్ మల్లికార్జున రావు తెలిపారు. బుధవారం రోటరీ భవనంలో నిర్వహించిన ప్రపంచ ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా పదవీ విరమణ చేసిన ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక కమిషనర్ మల్లికార్జున రావు పదవీ విరమణ పొందిన పురుషోత్తం రావు, ఎస్ సుబ్రమణ్యం, ముని భాస్కర్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున రావు మాట్లాడుతూ సమాజంలో ఉపాద్యాయ పాత్ర ముఖ్యమైనదని, పదవీ విరమణ అయిన తరువాత కూడా వీరందరూ సేవాసంస్దల్లో ఉంటూ సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ దశరధ రామిరెడ్డి, పాస్ట్ గవర్నర్ మునిగిరీష్, క్లబ్ అద్యక్షుడు తిరుమూరు సురేష్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.