BREAKING
క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన సీఎం కుమారుడి సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి మంత్రాలయం భక్తులకు భద్రత హెచ్చరికలు భారత్‌లో వేగంగా పెరుగుతున్న చిత్తవైకల్యం: 2036 నాటికి రెట్టింపు కానున్న డిమెన్షియా బాధితులు కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు గురుకుల పాఠశాలలో అధికారులు సంఘ రైతులు ఆర్థికంగా ఎదుటకు వెసులుబాటు కల్పిస్తాం రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపే లక్ష్యం కడప ఎంపీ ముంపు ప్రాంతాల్లో డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పర్యటన: రైతులకు, మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ విద్యుత్ ప్రమాదాల పై మంత్రి గొట్టిపాటి సీరియస్ *ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.!* *విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, అందరికీ నమస్కారములు తుపాన్ కు నష్టపోయిన బొప్పాయి, జొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు నాని ది ప్యారడైజ్ మూవీలో ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రల సర్ప్రైజ్.. అసలు విషయమేంటంటే! పోలాకి మండలంలో ఈదురుగాలుల బీభత్సం: పలు గ్రామాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు – యుద్ధప్రాతిపదికన తొలగించిన అధికారులు

రూ 100 కోట్లు టర్న్ అవర్ దిశగా సొసైటీ

Select Suryaa Now
రూ 100 కోట్లు టర్న్ అవర్ దిశగా సొసైటీ

రూ.100 కోట్ల టర్నోవర్ దిశగా సొసైటీ

సొసైటీ చైర్‌పర్సన్ బొంతు సత్యనారాయణ

టి.నరసాపురం మేజర్ న్యూస్: కె.జగ్గవరం సహకార సంఘాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు సొసైటీ చైర్‌పర్సన్ బొంతు సత్యనారాయణ తెలిపారు.

కె.జగ్గవరం సొసైటీ పరిధిలో గల బందంచర్ల ఎరువుల గోడౌన్ ప్రాంగణంలో గురువారం చైర్‌పర్సన్ బొంతు సత్యనారాయణ, సీఈఓ వీర వెంకయ్య, అధ్యక్షతన సంఘ మహాజన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా బొంతు సత్యనారాయణ మాట్లాడుతూ సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్ద ఉన్న సంఘ పెట్రోల్ బంక్ సమీపంలో ఎంపీఎఫ్‌సీ గోడౌన్, గుడ్లపల్లి సొసైటీ భవనం ఎదురుగా,తెడ్లం ఎరువుల  గోడౌన్ సమీపంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.సొసైటీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సంఘ మాజీ అధ్యక్షులు వాసిరెడ్డి మధు మాట్లాడుతూ దాతలు సంఘానికి అందించిన స్థలంలో మహాజన సభ నిర్వహించడం వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రతి మహాజన సభను దాతలు సంఘానికి అందించిన స్థలాల్లో నిర్వహించడం ద్వారా రైతులకు సంఘ కార్యకలాపాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.రైతుల సహకారంతో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

అనంతరం సీఈఓ తనగాల వీరవెంకయ్య మహాజన సభలో బడ్జెట్‌ను చదివి వినిపించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్లు పేరాబత్తుల జగన్,బాల విఘ్నేష్,జయ్యవరపు శ్రీరామ్ మూర్తి,పొలిమెర వెంకటేశ్వరరావు, భీమవరపు జగన్మోహన్‌రావు,వంటిపల్లి సుబ్రహ్మణ్యం, కుమారస్వామి,ఆచంట కుటుంబరావు, తోపాటు సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.