రీసర్వే ప్రక్రియ లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలి*
*రీసర్వే ప్రక్రియ లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలి*
*హౌసింగ్ ఫర్ ఆల్ కింద మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలి*
*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, సెప్టెంబర్ 24: రీసర్వే ప్రక్రియలో లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం రీ సర్వే, సర్ ప్రక్రియ, పెన్షన్, అక్షరాంధ్ర, తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియ లో నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను సాధించేలా ప్రతి అధికారి తన పరిధిలోని గ్రామాలు, బృందాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియను పూర్తి స్థాయిలో వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు.. బల్క్ భూ సమస్యల సంఖ్యను సక్రమంగా నమోదు చేయాలని, కొత్తగా గుర్తించే భూ సమస్యలను కూడా జాబితాలో చేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు..ఈ-ఆఫీస్ అమలును పూర్తిస్థాయిలో చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బల్క్ ఇష్యూస్, ఈ-ఆఫీస్ అమలు, మ్యుటేషన్లు సంబంధిత ప్రతిపాదనలు సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలన్నారు.కోర్టు కేసుల్లో జాప్యం ఉండకూడదని, ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్దేశిత గడువులోగా సమాధానాలు సమర్పించాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు.
హౌసింగ్ ఫర్ ఆల్ కింద అర్హులైన లబ్ధిదారులను ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో మ్యాపింగ్ చేయడాన్ని అక్టోబర్ 7లోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మ్యాపింగ్ పూర్తయిన అనంతరం మిగిలిన అర్హుల కోసం ప్రభుత్వ భూములను గుర్తించడం, అవసరమైన చోట పట్టా భూములను గుర్తించడం, భూసేకరణ అవసరమైతే ప్రతిపాదనలు సిద్ధం చేసి అక్టోబర్ 15లోగా సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆర్డీఓ లను ఆదేశించారు.
సర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులను రేపు సాయంత్రానికల్లా పరిష్కరించాలని కలెక్టర్ ఏఈఆర్‌ఓ లను ఆదేశించారు..
జిల్లాలో పెన్షన్ దరఖాస్తుల పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, కొన్ని మండలాల్లో ఇంకా అధిక సంఖ్యలో దరఖాస్తులు ఎంపీడీఓల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..తిరస్కరణ అయిన దరఖాస్తులను పరిశీలించి కారణాలను సమీక్షించాలని కలెక్టర్ డిఆర్డిఏ పిడి ని ఆదేశించారు. 100కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న 14 మండలాల ఎంపీడీఓలతో సమన్వయం చేసుకుని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ల స్థాయిలో 105 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలన్నారు.
అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి కోసిగి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, తుగ్గలి, ఆలూరు మండలాల్లో 25 శాతానికి పైగా అటెండెన్స్ పెండింగ్ ఉందని, ఆయా మండలాల ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటెండెన్స్‌ను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపిడిఓ లను ఆదేశించారు.
టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రావు, జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ డిడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ఆర్వో లు, ఏ ఈఆర్వో లు, ఎంపిడిఓ లు, తదితరులు పాల్గొన్నారు..