రక్తదాన శిబిరంలో 38 మంది విద్యార్థులు రక్తదానం
చీపురుపల్లి, సూర్య : చీపురుపల్లి రెడ్ క్రాస్ డివిజన్ ఇంచార్జ్ బి వి గోవిందరాజులు ఆధ్వర్యంలో చీపురుపల్లి బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో అత్యవసర రక్తదాన శిబిరం మంగళవారం నిర్వహించారు. గరివిడి అవంతి ఇంజనీరింగ్ కళాశాల, చీపురుపల్లి సత్య రామ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, ఇతర కళాశాలలకు చెందిన 38 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం రెడ్ క్రాస్ చైర్మన్ కంది వెంకటరమణ, డాక్టర్ పల్ల వెంకయ్య, వెటర్నరీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎమ్ రవికుమార్, అధ్యాపకులు, అప్పలనాయుడు, ముకుంద, రెడ్ క్రాస్ సభ్యులు డి ఆర్ ప్రసాద్ రావు, పి ఆర్ ఓ దుర్గాప్రసాద్, ఎం ఎల్ టి లు బంగార్రాజు, కొండల రాజు తదితరులు పాల్గొన్నారు.