BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

రామాపురం పల్లె పండుగకు భారీగా తరలిరావాలి

Select Suryaa Now
రామాపురం పల్లె పండుగకు భారీగా తరలిరావాలి

టీడీపీ నియోజకవర్గ యువ నాయకుడు పోతిరెడ్డి తిరుపతిరెడ్డి పిలుపు

పామూరు, మేజర్ న్యూస్ : 

ఈ నెల 29న రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువ నాయకుడు, ప్రముఖ రియల్టర్‌ పోతిరెడ్డి తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో రామాపురానికి తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ప్రజలను కార్యక్రమానికి తరలించేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనే పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోతిరెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు.