BREAKING
2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడుతారా.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు! ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదినం శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు అమరవీరుల త్యాగాలు మరువలేనివి కాంగ్రెస్ వైఫల్యాలకు తగిన సమాధానం చెప్పాలి పట్టభద్రుల ఎన్నికల పై ఎం.జి.ఆర్. సూచన వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం రక్తదాన శిబిరం పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రకటన.. శ్రీలంక సిరీస్‌కు కొత్త ఆటగాళ్లకు పిలుపు దేవరపల్లిని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతా శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు రిమాండ్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పీడీఓలకు.. ఎంపిడిఓ మమత సూచనలు

రాజేష్ వర్మ భవితవ్యంపై జోరుగా చర్చలు

Select Suryaa Now
రాజేష్ వర్మ భవితవ్యంపై జోరుగా చర్చలు

విజయనగరం బ్యూరో, సూర్య :  జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ రాజకీయ భవితవ్యం ఇప్పుడు అపార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుర్ల మండలం పల్లెగండ్రేడుకు చెందిన రాజేష్ వర్మ.. పక్క గ్రామం తెట్టంగి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా స్థానికుడు, టీడీపీ నాయకుడు వెన్నె సన్యాసినాయుడు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో, స్థానికంగా గందరగోళం నెలకొంది. రాజేష్ వర్మ నామినేషన్ ఉపసంహరణకు ఆయనపై ఒత్తిళ్ళువస్తున్నట్టు సమాచారం. ఇలాఉంటే, రాజేష్ వర్మ గతంలో మండలంలో విద్యుత్తు శాఖ అధికారులు టీడీపీ నేతల చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కొద్దినెలల క్రితం విజయనగరం - పాలకొండ ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులతో కలసి భైఠాయించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కూటమి భాగస్వామ్య పార్టీ అయిఉండి, మరో భాగస్వామ్య పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో పార్టీపట్ల ఆయన నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆయన నామినేషన్ వేసిన తెట్టంగి నుంచి అప్పట్లో ఆయన మండిపడ్డ టీడీపీ నేతే ఎంపీటీసీ బరిలో ఉండడం గమనార్హం. ఇప్పుడు అదే టీడీపీ నేతతోపాటు వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుంటే కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు పార్టీ శ్రేణులు సూచిస్తున్నట్టు భోగట్టా. ప్రస్తుతానికి రాజేష్ వర్మ ఏ నిర్ణయం తీసుకొనప్పటికీ నామినేషన్ కు కట్టుబడి ఉండేందుకు భావిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్న రాజేష్ వర్మ ఒత్తిళ్లకు లొంగి నామినేషన్ ఉపసంహరించుకుంటే, లోపాయికారీగా మరేదో జరిగి ఉంటుందనే ప్రచారం జరిగే ప్రమాదం ఉందని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీని ప్రభావం ఆయన జిల్లా అధ్యక్షుడు పదవికే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాజేష్ వర్మ నిర్ణయంపై జిల్లా బీజేపీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.