BREAKING
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు, అభిమానులకు సర్ ప్రైజ్ 'స్కారీ పిక్చర్' సినిమాలో కంగనా రనౌత్, నిర్మిస్తున్న రానా దగ్గుబాటి 'రామాయణం' సినిమాపై నటుడు యష్ ఆసక్తికర వ్యాఖ్యలు పర్యాటకులకు షాకింగ్ ట్విస్ట్: ఈజిప్ట్‌లో హిడెన్ ఛార్జీల మోసంపై నెటిజన్ల చర్చ థాయిలాండ్‌లో 'మిరాకిల్ హెర్బ్' స్కామ్: పోలీసుల ఎంట్రీతో దిగొచ్చిన ముఠా తూముకుంట బ్యాంక్ కాలనీలో పొంగిపొర్లుతున్న మురుగునీరు.. రెండు రోజులైనా స్పందించని అధికారులు జీఎస్టీ సంస్కరణలతో విశ్వసనీయ పాలన దిశగా కీలక ముందడుగు.. 'డీక్రిమినలైజేషన్' నిర్ణయాలను స్వాగతించిన సీఐఐ! బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ తుఫాన్: 800 కోట్ల క్లబ్‌లో 'జైలర్ 2' రూపాయి ఊహించని రికవరీకి అసలు పరీక్ష సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభం చైనా విమానయాన రంగంలో పూర్తి సంవత్సర నష్టాల బారిన టాప్ త్రీ ఎయిర్‌లైన్స్ భారత అపర కుబేరుల సంపద వివరాలు.. ₹11.23 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ అగ్రస్థానం, రెండో స్థానంలో ముఖేష్ అంబానీ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా 'నషా ముక్త్ భారత్' సైక్లింగ్ ర్యాలీ ఎన్నికలు విధుల్లో ఉన్న సిబ్బందికి నాణ్యత లేని భోజనం. $63 కోట్ల భారీ హ్యాకింగ్ ఘటన తర్వాత కోలుకుంటున్న బైనాన్స్

ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదే: రాజ్యాంగ విశ్లేషకులు వై. వి. శివయ్య

Select Suryaa Now
ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదే: రాజ్యాంగ విశ్లేషకులు వై. వి. శివయ్య

ఓటు హక్కు ప్రజాస్వామ్య విజయానికి మూలస్తంభం

యువతలో ఓటింగ్ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది

 (డోన్ మేజర్ న్యూస్):ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ నిర్ణయం ప్రజలదేనని, సమాజ మార్పుకు ఓటు హక్కు ఒక వజ్రాయుధం వంటిదని ప్రముఖ అధ్యాపకులు, రాజ్యాంగ విశ్లేషకులు శ్రీ వై. వి. శివయ్య పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజరికాల పునాదులు కనుమరుగై, ప్రజలే పాలకులను ఎన్నుకునే విశిష్ట వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు.స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారత రాజ్యాంగం కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా సర్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించిందని తెలిపారు. ప్రారంభంలో 21 సంవత్సరాలుగా ఉన్న ఓటు హక్కు వయస్సును మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కాలంలో 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందన్నారు. ఈ మార్పు ద్వారా 18 ఏళ్లు నిండిన యువత తొలిసారిగా 1987లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో, అనంతరం 1989లో దేశవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది భారత ఎన్నికల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని కొనియాడారు.

యువతలో తగ్గుతున్న ఓటింగ్ ఆసక్తి బాధాకరం:

దేశ భవిష్యత్తు యువతకు లభించే అవకాశాలు, వారి ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని, అయితే ప్రస్తుత యువతలో ఓటు వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం విచారకరమని శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల బాధ్యతలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు స్పష్టత కొరవడుతోందన్నారు.

సినిమాల విడుదల రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచే థియేటర్ల వద్ద క్యూ కట్టే యువత, పోలింగ్ కేంద్రాల వద్ద అరగంట సమయం కేటాయించలేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 88 ఏళ్ల వయోవృద్ధులు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న తరుణంలో యువత బాధ్యతారాహిత్యంగా ఉండటంపై విస్తృత చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

విద్యా వ్యవస్థలో ఓటు విలువపై పాఠాలు ఉండాలి:

మన విద్యా వ్యవస్థలో కనీసం నెలకు ఒక రోజైనా విద్యార్థులకు ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విశిష్టతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. యువత చురుగ్గా పాల్గొన్నప్పుడే భారత ప్రజాస్వామ్యం సంపూర్ణ విజయం సాధిస్తుందని, మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారానే సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని శివయ్య కోరారు