ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచిన ఓటర్ల జాబితా
నర్సీపట్నం సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్ :
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర ఇబ్బందితో కలిసి ఓటర్ల జాబితాను కుల ప్రాతిపదికన విభాగించిన ప్రతులను ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని కమిషనర్ సురేంద్ర తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి సర్కులర్ ఉత్తర్వులు 525/SEC-F2/2026 ໖໖ 21-09-2026 సంఘం 40 వార్డులకు సంబందించి నిర్దేశించిన రూల్స్ ప్రకారం, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు 76 తుది పోలింగ్ కేంద్రాలను అనుబంధం - VII లో తేదీ. 28-09-2026న ప్రచురించుట జరిగినది. ఈ తుది పోలింగ్ కేంద్రాల జాబితాను పురపాలక సంఘ కార్యాలయ నోటీస్ బోర్డు, జిల్లా కలెక్టరు వారి కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం, గౌరవ సబ్ కోర్ట్, గౌరవ పిడిఎమ్ కోర్టు వారి కార్యాలయము, పోస్ట్ ఆఫీసు, అన్ని బ్యాంకు కార్యాలయములు మరియు 17 స్వర్ణ వార్డు కార్యాలయములలో తేదీ 28-09-2026 ప్రచురించి వాటిని పరిశీలనార్ధం ఆయా కేంద్రాలలో అందుబాటులో ఉంచామని కమిషనర్ సురేంద్ర తెలిపారు.