పోయిన బంగారు ఉంగరం రెండు రోజుల్లో గుర్తింపు
చీపురుపల్లి అక్టోబర్ 21 మేజర్ న్యూస్: పట్టణానికి చెందిన భవిరి గణపతి జారవిడిచుకున్న బంగారం ఉంగరాన్ని రెండురోజుల్లో గుర్తించి బాధితుడికి అప్పగించిన పోలీసులు. ఈనెల 19న ఉదయం సుమారు 8 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి తన ద్విచక్ర వాహనంపై ముదురోడ్ల కూడలికి వచ్చిన గణపతి అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఆయన చేతికి ఉన్న సుమారు అర తులం బంగారు ఉంగరం పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ పి ఉమా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు క్రైమ్ కానిస్టేబుళ్లు మీసాల రమణ, బొంతు రాంబాబు రంగంలోకి దిగారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, తమ అనుభవం, చాకచక్యం, సమయస్ఫూర్తితో దర్యాప్తు చేపట్టి, పోయిన బంగారు ఉంగరాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. పోలీసుల చొరవ, నిరంతర ప్రయత్నాల ఫలితంగా కేవలం రెండు రోజుల్లో పోయిన బంగారు ఉంగరాన్ని గుర్తించి బాధితుడికి తిరిగి బుధవారం అప్పగించారు. సకాలంలో స్పందించి, తమకు సహాయం చేసిన చీపురుపల్లి పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసుల సేవలను అభినందించారు.
మధు, సూర్య చీపురుపల్లి విజయనగరం జిల్లా