పోలీసు గుప్పెట్లో పులివెందుల నామినేషన్ల సందర్భంగా నిన్న జరిగిన గొడవల నేపథ్యంలో పట్టణమంతా కట్టుదిట్టమైన బందోబస్తు
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల పట్టణంలో పోలీసుల నిఘా పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా నిన్న చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అయినా పాత బస్టాండ్ సర్కిల్లో ముల్లకంచని ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పులివెందుల పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా