BREAKING
టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది)

కూటమి చైర్మన్ అభ్యర్థిగా నేడు మాచాని సునీత నామినేషన్

Select Suryaa Now
కూటమి చైర్మన్ అభ్యర్థిగా నేడు మాచాని సునీత నామినేషన్

కూటమి చైర్మన్ అభ్యర్థిగా నేడు మాచాని సునీత నామినేషన్
ఎమ్మిగనూరు,  సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు 
స్థానిక రాజకీయాల్లోకి
ఎంబీ నాగప్ప కుటుంబానికి చెందిన మాచాని సునీత కూటమి పాలనలో ఎమ్మిగనర్ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా నియామకం జరిగింది ఈ సందర్భంగా ఆమె ఆదివారం తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు దీంతో ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆమె పేరును తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అధికారికంగా శనివారం ప్రకటించడంతో ఆమె రాజకీయ ప్రవేశం స్థానికంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మాచాని సునీత పట్టణంలోని ప్రజాదరణ పొందిన మాచాని కుటుంబానికి చెందిన ఎంబీ నాగప్ప మూడో కోడలు. ఆమె భర్త మాచాని మహేష్ ప్రస్తుతం ఎమ్మిగనూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు, పట్టణంలో పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తున్నారు. మాచాని సునీత డిగ్రీ విద్యను మధ్యలోనే నిలిపివేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పటివరకు కుటుంబ బాధ్యతల్లో ఉన్న సునీత, భర్త మాచాని మహేష్ రాజకీయ కార్యకలాపాలకు, పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఆమెపై ఉంచిన నమ్మకంతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో, నేరుగా ఎన్నికల బరిలో నిలిచి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేశారు. మాచాని సునీత రాజకీయ ప్రవేశాన్ని, చైర్మన్ అభ్యర్థిగా ఆమె నియామకాన్ని స్థానిక టీడీపీ నేతలు, మహిళా విభాగం, శ్రేణులు విశేషంగా స్వాగతిస్తున్నాయి. మహిళా నాయకత్వానికి టీడీపీ ప్రాధాన్యం ఇవ్వడం పట్ల పట్టణ ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాజా శరత్ కుమార్. ఏ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా