పంచాయతీకి ఆదాయం వచ్చేలా పని చేయాల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
వేంపల్లె మేజర్ న్యూస్:
పంచాయతీకీ ఆదాయం వచ్చేలా అధికారులు పని చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో డిడిఓ వెంకట సుబ్బయ్యతో కలిసి ఆయా సమస్యలపై ఆరాతీసారు. అంతేకాకుండా సిబ్బందికి సంబంధించిన ఇపిఎఫ్ నిధులు, అరియర్స్, ఎల్ఐసి, జీతాల సమస్య త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని, కార్మికులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. గతంలో పనిచేసిన అధికారులు ప్రజలు కట్టిన ఆయా పన్నుల వసూళ్ల డబ్బులను పంచాయతీలో జమ చేయకుండా పోవడం వల్ల ఆ నిధులు దుర్వినియోగం అయినట్లు తెలిపారు. దీంతో విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగిందన్నారు. దీంతో పాటు పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి ఇతర కార్మికులకు నెల నెల జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడిప్పుడే పంచాయతీ గాడిన పడుతుందని, సిబ్బందికి చెందిన ఇపిఎఫ్, ఎల్ఐసి డబ్బులు రూ. 69 లక్షలు కుట్టకుండా గతంలో పనిచేసిన అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులు ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వీటి పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఇంటి పన్నులు స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో చెల్లించి రసీదు పొందాలని ప్రజలకు సూచించారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఏపి సిఎం చంద్రబాబు, డిసిఎం పవన్ కళ్యాణ్ స్వర్ణ గ్రామ పంచాయతీ పోర్టల్ ని ఏర్పాటు చేశారన్నారు. స్థానిక పార్క్ కు సంబంధించి ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీకి డబ్బులు చెల్లించకుండా అనధికార ప్లాట్లు వేస్తున్నారని వీటిపై కూడా చర్యలు చేపట్టాలని, పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పరంగా తాము అండగా ఉంటామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అందరి సమిష్టి కృషితో వేంపల్లె పంచాయతీని స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కుళాయమ్మ, డిప్యూటీ ఎంపిడిఓ రమణయ్య, ఇఓ కవిత, జనసేన సమన్వయకర్త డా.హరిష్, టిడిపి నాయకులు జీవి రమణ, ఏమిరెడ్డి కృష్ణారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఆర్వీ రమేష్, భాస్కర్ రెడ్డి, పోతిరెడ్డి శివ, తదితరులు పాల్గొన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.