పల్లెపండుగ సంబరాల్లో.. ప్రభుత్వఅధికార యంత్రాంగం ..
పల్లెపండుగ సంబరాల్లో..
ప్రభుత్వఅధికార యంత్రాంగం ..
భారీగా తరలి వెళ్లిన లైన్ డిపార్టుమెంట్ల అధికారులు...
3.0 పనుల్లో నాణ్యత.. పారదర్శక అమలుకు పెద్ద పీట..
నెల్లూరు/వేదాయపాలెం (మేజర్ న్యూస్)..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం.. వరికుంటపాడు పరిధిలోని కడప..ప్రకాశం..నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రామాపురం గ్రామంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ-3.0 సంబరాల్లో పాల్గొనేందుకు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు భారీగా తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.. ఐటీ.. పరిశ్రమలు.. విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తోపాటుకూటమి ప్రభుత్వంలోని అన్ని శాఖల మంత్రులు.. శాసనసభ్యులు.. ప్రజా ప్రతినిధులు.. నేతలు.. కార్యకర్తలు అభిమానులు.. ప్రజలు దాదాపు లక్ష మంది పైచిలుకు తొలిసారిగా పాల్గొని విబిజీరామ్ జీ ఉపాధి హామీ పథకంకింద రూ 11085 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న పల్లెపండుగ 3.0 వేడుకలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పల్లె పండుగ-3.0 ఉపాధి హామీ పథకం కింద విడుదల చేస్తున్న నిధుల్లో కేంద్రం వాటా-రూ 5391 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ 5694 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారిక సమాచారం.
అందులోభాగంగానే
రూ.2700 కోట్ల ఖర్చుతో 6వేల కిలోమీటర్ల మేర సీ సీ రోడ్లు..రూ.7550 కోట్లతో 9500 కిలోమీటర్ల దూరంతో బీటీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.. అదేవిధంగా పాడిరైతుల కోసం మరో రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలు..రూ 225 కోట్లతో 50వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగుకు సంబంధించిన తోటల పెంపకం..రూ 110 కోట్లతో 1000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు..రూ 200కోట్లతో బస్ షెల్టర్లు.. గ్రామపంచాయతీ భవనాలు..రచ్చబండలు ఏర్పాటుచేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలతో అభివృద్ధి సంక్షేమాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేరువ చేర్చాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగ-3.0 ద్వారా చేపడుతున్న మహత్తర యజ్ఞంలో పాల్గొనేందుకు జిల్లాలోని జలవనరులశాఖ లో అంతర్భాగమైన సోమశిల..తెలుగుగంగ.. విద్యుత్.. పంచాయతీరాజ్..అటవీ శాఖ విభాగాలైన టెరిటోరియల్.. సామాజిక వన విభాగం(సోషల్ ఫారెస్ట్)..అటవీ అభివృద్ధి సంస్థ..హౌసింగ్.. పరిశ్రమలు..ఏపీఐఐసీ.. ఏపీఎస్ఎఫ్ సి..ఉద్యాన శాఖ.. సెట్నల్ విభాగాలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయి అధికారులు భారీగా తరలివెళ్లారు