BREAKING
రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 35.90 లక్షలు 8న రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి టూర్ షెడ్యూల్ ఖనిజ సంపద అన్వేషణకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో శ్రీకారం రెండు వారాలు ముందుగానే థియేటర్లలోకి వస్తున్న నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కల్యాణం’.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు! కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.

పల్లెల స్వరూపం మార్చేందుకే విలేజ్ హెల్త్ క్లినిక్‌లు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

Select Suryaa Now
పల్లెల స్వరూపం మార్చేందుకే విలేజ్ హెల్త్ క్లినిక్‌లు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

​బోగోలులో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన... కావలి ఎమ్మెల్యే  రూ. 9 కోట్లతో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..!  కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి

​బోగోలు, మేజర్ న్యూస్ :      పల్లె ప్రాంతాలు కూడా పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

​ఆరోగ్యం – సంక్షేమమే లక్ష్యం :  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదరికం నుండి వచ్చినవాడిని కాబట్టి ప్రజల కష్టాలు, వారి ఆరోగ్య సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, నియోజకవర్గానికి ఒక రోల్ మోడల్ ఎమ్మెల్యేగా నిలవడమే తన ఏకైక కోరికని స్పష్టం చేశారు. గతంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఈ హెల్త్ క్లినిక్‌‌ల ద్వారా ప్రాథమిక స్థాయిలోనే రోగ నిర్ధారణ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. బోగోలు మండలం వ్యాప్తంగా 14, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సహకారంతో 1,800కు పైగా హెల్త్ క్లినిక్‌లను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని తెలిపారు.

​రూ. 9 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం :  చరిత్ర కలిగిన బోగోలు మండలంలో రూ. 9 కోట్ల నిధుల వ్యయంతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. అంతేకాకుండా జువ్వలదిన్నె హార్బర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటూ, మత్స్యకారులకు 60 శాతం సబ్సిడీతో బోట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌డీఆర్ నిధుల నుంచి రూ. కోటికి పైగా ఖర్చు చేసి చెరువులకు నీటిని తరలిస్తున్నామని, నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.

​రైతన్నకు అండగా ప్రభుత్వం : బోగోలు మండలంలో రైతులకు రెండో పంటకు నీరందేలా చర్యలు తీసుకున్నామని, ఫలితంగా కావలి నియోజకవర్గంలో రైతులు సుమారు రూ. 700 కోట్లు సంపాదించడం ఒక ఎమ్మెల్యేగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని సీఎం ఆదేశాల మేరకు కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించామన్నారు..

 ఉపాధి అవకాశాలు – విద్యకు ప్రాధాన్యం : బోగోలు రైల్వే స్టేషన్‌లో ఉన్న 23 లూప్ లైన్లను సరైన రీతిలో వినియోగించుకుంటే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధితో పాటు సుమారు 20 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, దాతల సహకారంతో రూ. 3.5 కోట్లతో ఆసుపత్రి నిర్మించామని, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు ఒక్కొక్కరికి రూ. 13,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. బోగోలు మండలాన్ని అన్ని విధాలా మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు..ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్ఓ, పంచాయతీరాజ్ ఎస్సీ,, మండల తాసిల్దార్, ఎంపీడీవో, బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు గారు పిఎసిఎస్ అధ్యక్షులు చిలకపాడు వెంకటేశ్వర్లు గారు కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి గారు లేలపల్లి సుధీర్ కుమార్ గారు ఐటీడీపీ అధ్యక్షులు సంజయ్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు సయ్యద్ శుభాని భాష తదితరులు పాల్గొన్నారు