BREAKING
అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన పాత ముద్దాయిలకు బైండోవర్ బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా కేటీఆర్ పర్యటన - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనంతపురం 9వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ఇంటింటా ప్రచారం’: కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కుంచపు నాగరత్నమ్మకు బ్రహ్మరథం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఉత్తర నియోజకవర్గం 54వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారం అంతర్జాతీయ సముద్ర రవాణాకు భారీ గండం జి.ఆర్.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు ముగింపు కార్యక్రమం ఎల్కపల్లి రైతు వేదికలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ రైలు కిందపడి యువకుడు మృతి 49 వ వార్డును ఉత్తమ వార్డుగా చేస్తాను.. వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ కి ఓటేయాలి. 69వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా బీద మస్తాన్ రావు భారీ ర్యాలీ దక్షిణంలో వైసిపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి విస్తృతంగా ప్రచారం ఏదులాపురం అభివృద్ధికి మరో రూ.100 కోట్లు ఉచిత కంటి శిబిరంలో 55 మందికి కంటి పరీక్షలు....* *20 మందికి కంటి ఆపరేషన్లు....* జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి...

నెల్లూరు రూరల్ లో 37 లో గెలుపు... వ్యూహాలు

Select Suryaa Now
నెల్లూరు రూరల్ లో 37 లో గెలుపు... వ్యూహాలు

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :  వెయ్యి ఓట్ల మెజారిటీ వచ్చేలా క్షేత్రస్థాయిలో ప్రణాళిక   క్లస్టర్ ఇంచార్జిగా అదనపు బాధ్యతలను మన్నెం పెంచలనాయుడు సక్సెస్   ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న టిడిపి నెల్లూరు రూరల్ పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్   నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కూడా ఈ ప్రాంతంలో అప్పటి టిడిపి అభ్యర్థి అబ్దుల్ అజీజ్ కు మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం 37వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా అబ్దుల్ రసూల్ పోటీ చేస్తూ దాదాపుగా విజయం ఖాయం చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించడంతో గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న టిడిపి క్లస్టర్ ఇంచార్జి పెంచల నాయుడు, టిడిపి పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్ లు ఈ డివిజన్లో భారీ మెజారిటీ తీసుకువచ్చేందుకు నిరంతరం కష్టపడుతున్నారు.  ఎప్పటికప్పుడు క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ వారికి దిశా, నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే వారి క్లస్టర్ పరిధిలోని 41,47 డివిజన్లను ఏకగ్రీవంగా చేయడంలో వారు కీలకంగా వ్యవహరించి వహించి విజయం సాధించారు. చివరి రెండు రోజులు కావడంతో గెలుపు వ్యూహాలకు సంబంధించి ఎత్తుగడల్లో నిమగ్నమయ్యారు. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే వక్ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పాటు ముస్లిం మత పెద్దలు కూడా రసూల్ తరఫున నిరంతరం పనిచేస్తున్నారు. మహాత్మా గాంధీ నగర్ బాధ్యతలు అప్పగించిన అతి తక్కువ సమయంలోనే పెంచలనాయుడు, జలదంకి సుధాకర్ లు ఎమ్మెల్యే పెట్టిన బాధ్యతను వంద శాతం నిర్వర్తించి...వెయ్యి ఓట్లు మెజారిటీ తో మహాత్మా గాంధీ నగర్ విజయంను కానుకగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.