నగరం సిహెచ్ సి సాధారణ పరిపాలన విభాగంలో నియమితులైన సంజయ్
నగరం, మేజర్ న్యూస్:
నగరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సాధారణ పరిపాలనా విభాగంలో విధులు నిర్వర్తించేందుకు ఎన్. సంజయ్ ను ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా నియమితులయ్యారు. ఈయన అవుట్ పేషెంట్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తూ, హాస్పిటల్ రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరణ చేస్తారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సంజీవ్ ను బాపట్ల జిల్లాకు ఇంచార్జిగా నియమిస్తూ పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ & జెఎసి రాష్ట్ర కార్యదర్శి వి. రమేష్ బాబు నుంచి ఈయన ఉత్తర్వులు అందుకున్నారు. సంజీవ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానిక సిహెచ్ సి వైద్యాధికారి ఎం. రత్న కుమారి, ఇతర వైద్య సిబ్బంది అభినందించారు.