BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

*నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు భాగస్వాములు కండి* - మేయర్

Select Suryaa Now
*నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు భాగస్వాములు కండి*  - మేయర్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  : నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రతి ఒక్క పౌరుడు సహకరించి స్వచ్ఛతా సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ  మేయర్ దేవరకొండ సుజాత  పిలుపునిచ్చారు. “ఒక రోజు • ఒక గంట • ఒకేసారి” – స్వచ్ఛత కోసం సామూహిక శ్రమదానం స్వచ్ఛతా హి సేవా – 2026 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,  ప్రజల భాగస్వామ్యంతో “ఒక రోజు • ఒక గంట • ఒకేసారి” అనే నినాదంతో స్వచ్ఛంద శ్రమదానం కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద సామూహిక పారిశుద్ధ్య శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించడంతో పాటు, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.  అనంతరం మేయర్, నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శ్రమదాన కార్యక్రమంలో భాగస్వాములై ప్రాంగణమంతా శుభ్రం చేశారు. హాజరైన అధికారులు, ప్రజలు, విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. “స్వచ్ఛమైన నెల్లూరు – ఆరోగ్యకరమైన నెల్లూరు” సాధించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నెల్లూరు నగరపాలక సంస్థ పిలుపునిస్తోందని వారు తెలిపారు.