BREAKING
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం

మంత్రి ఆనం కృషికి ముఖ్యమంత్రి కీలక భరోసా

Select Suryaa Now
మంత్రి ఆనం కృషికి ముఖ్యమంత్రి కీలక భరోసా

మర్రిపాడు మేజర్ న్యూస్: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి కీలక భరోసా లభించింది. జిల్లాలోని వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం జరిగిన పల్లె పండుగ బహిరంగ సభలో సోమశిలకు సంబంధించిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది. సోమశిల జలాశయంతో పాటు హైలెవల్ కెనాల్ మొదటి దశకు సంబంధించిన కీలక పనులను ముందుకు తీసుకెళ్లాలన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంకల్పానికి ముఖ్యమంత్రి స్పందనతో దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న సోమశిల అభివృద్ధి అంశానికి రామాపురం సభ వేదికగా మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల ప్రాజెక్టు భద్రతకు 110 కోట్ల రూపాయలను, మర్రిపాడు మండల ప్రాంతంలో నిలిచిపోయిన సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి దశ పనులకు 85 కోట్ల రూపాయలను మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడంతో మెట్ట రైతులకు ఊరట లభించేందని చెప్పవచ్చు. ఈ పనులను పరిశీలించమని సభా వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుకు తెలపడం జరిగింది.