మానవ సేవే మాధవ సేవ అంటున్న డాక్టర్ అప్పినపల్లి
- సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు
- చైతన్య సర్వీస్ సొసైటీ సొంత భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం
మదనపల్లె,మేజర్ న్యూస్ : మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఏబీసీ సేవా సంస్థ అధినేత,ఆరోగ్య ప్రదాత,ఆహార దాత డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.ఇందులో భాగంగా మదనపల్లె పట్టణంలో రెండు దశాబ్దాలకుపైగా వయో వృద్ధులకు,తోడు నీడలేని పిల్లలకు ఆశ్రయమిస్తూ విద్యాబుద్దులు నేర్పిస్తున్న చైతన్య సేవాసంస్థ సొంత భవన నిర్మాణానికి డా.అప్పినపల్లి భాస్కరాచారి సిమెంట్ బస్తాలను వితరణగా అందజేయడంతోపాటు ఆర్థిక సహాయాన్ని అందించి మరోమారు మానవత్వాన్ని చాటిచెప్పారు.సేవేదైవంగా నమ్ముతూ నిరాడంబరంగా,సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే సేవామూర్తి అని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ.కవితారాణి కొనియాడారు.చైతన్య స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహిస్తున్న అనాథ పిల్లల సంరక్షణ,విద్య,వైద్యం,ఆహారం,ఆరోగ్యం వంటి సేవలకు అప్పినపల్లి భాస్కరాచారి ఇది వరకు కూడ ఆర్థికంగా,వస్తురూపంలో అండగా నిలుస్తూ సంస్థ అభివృద్ధికి తమవంతు చేయూతను అందిస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం సంస్థ సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భవన నిర్మాణానికి అవసరమైన ముడిసరుకుల్లో భాగంగా సిమెంటును,ఆర్థిక సహాయాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.అంతే కాకుండా ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కంటి పరీక్షలు,అన్నదానం,ఆహా రం,ఆరోగ్య సంరక్షణ వంటి సేవల ద్వారా వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారని కొనియాడారు.త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్న డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారికి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజ అభివృద్ధికి సేవాభావం,నిబద్ధత,మానవత్వం ఎంతో అవసరమని,ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించి పేదలు,వృద్ధులు,నిరుపేద పిల్లలకు మరింత అండగా నిలవాలని కవితా రాణి ఆకాంక్షించారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి