BREAKING
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైనా మందగమనంతో లగ్జరీ రంగానికి భారీ దెబ్బ ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు సైబర్దాడిపై ఆహోల్డ్ డెల్హైజ్ స్పష్టత...కస్టమర్ల డేటా చోరీకి ఆధారాలు లేవని వెల్లడి! ఆరుగోశాలకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ ఉపాధ్యక్షులు" దాసరి" సీతమ్స్ లో హ్యాక్ స్పియర్ హ్యాకథాన్ ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'.. నలుగురి గ్యాంగ్ కొత్త పోస్టర్ వైరల్! మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు రైతుబజార్ లో 'ధరణి' నాణ్యమైన బియ్యం కేంద్రం ప్రారంభించిన కూటమి నేతలు విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి తయారీ వ్యూహాలను వేగంగా మారుస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు!

కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె - 28వరోజు రిలే దీక్షలు

Select Suryaa Now
కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె - 28వరోజు రిలే దీక్షలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ప్రభుత్వం  తమ న్యాయమైన కోర్కెలను ఆమోదించాలని కోరుతూఆత్మకూరులో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి  28వ రోజుకు చేరుకొని కొనసాగుతోంది. వారంతా మండల రెవెన్యూ కార్యాలయంలో శిభిరంలో బైటాయించి రిలే దీక్షలు చేస్తూ సమ్మె నిరవదికంగా కొనసాగిస్తున్నారు.అనాదిగా తాము చాలీ చాలని అరా కొరా వేతనంతో పూర్తి సమయం కేటాయించి విధులు నిర్వహిస్తూ కుటుంబాలు పోషించుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు. ఎన్ని విన్నపాలు చేసినా,ఆందోళనలు చేసినా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తదితరాలతో తమ కుటుంబ పోషణ అత్యంత భారంగా మారిందని వారు పేర్కొన్నారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ గా ఒకే దపాగా అర్హత గల వారికి విఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలు గా పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వారు ముక్త కంఠంతో కోరారు. ప్రభుత్వం తమ దయనీయ పరిస్థితి ని గమనించి కనికరించాలని వారు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘ రాష్ట్రకోశాధికారి హాజరత్తయ్య, మండల అధ్యక్షుడు సి. హెచ్.సుదర్శన్,మండల ఉపాధ్యక్షులు అంకయ్య, ఖదీర్,నారాయణ, నాయకులు విష్ణు,పెద్దన్న, పెంచలయ్య, కొండమ్మ, రమణయ్య, కొండయ్య, మునెమ్మ, రఫియా, అరుణమ్మ,హైమావతి, ప్రసాద్, మండలంలోని పలువురు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.