BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం

Select Suryaa Now
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం

కొబ్బరి ఆధారిత పరిశ్రమల  ఏర్పాటుపై ప్రణాళికల సిద్ధం.

కోకో గార్డెన్స్, అగ్రి టూరిజం, కోకోపీట్ ఎగుమతులకు ప్రోత్సాహం.…

 

కలెక్టర్  ఆర్. మహేష్ కుమార్..

అమలాపురం, 

మేజర్ న్యూస్ 

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ  జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల కేంద్రం ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి, ఉద్యాన శాఖ అధికారులతో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, పర్యావరణహిత పరిశ్రమలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్లలో స్థానిక ఉత్పత్తులకు విస్తృత అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలోని వివిధ అంశాలను  కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన, వ్యర్థాల పునర్వినియోగం, పర్యాటక అభివృద్ధి, ఎగుమతుల విస్తరణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. 

కోనసీమ బాల్ కొప్రాకు జీఐ ట్యాగ్ సాధించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ బాల్ కొప్రాకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ సాధించే దిశగా పటిష్టమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

కొబ్బరి వ్యర్థాల పునర్వినియోగానికి పర్యావరణహిత సాంకేతికత ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రస్తుతం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాని కొబ్బరి వ్యర్థాలను సుమారు 60 నుంచి 70 శాతం వరకు సమర్థవంతంగా పునర్వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

పీచు, చిప్పల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించాలని,  ‘కల్పవృక్ష’ నెట్-జీరో కార్బన్ సింక్ ఇండస్ట్రియల్ కారిడార్ భావనను ప్రాజెక్టులో పొందుపరచాలని సూచించారు. 

అంబాజీపేట ప్రాంతంలో కొబ్బరి తోటల ప్రత్యేకతలు, సాగు విధానాలు, కొబ్బరి ఉత్పత్తుల తయారీ ప్రక్రియలను పర్యాటకులకు పరిచయం చేసేలా ‘కోకో గార్డెన్స్’ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. ఊటీ టీ గార్డెన్స్ తరహాలో కొబ్బరి తోటలను పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని గోదావరి హెరిటేజ్ అగ్రి-టూరిజం సర్క్యూట్‌తో అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ పర్యాటకానికి ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. 

కొబ్బరి పీచు నుంచి తయారయ్యే కోకోపీట్ బ్లాక్‌లకు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. యూరప్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ముఖ్యంగా దుబాయ్ వంటి మార్కెట్లలో పీట్ మాస్‌కు ప్రత్యామ్నాయంగా కోకోపీట్ బ్లాక్‌ల వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.

ఉద్యాన పరిశోధనా కేంద్రం భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతికతతో ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ తెలియజేశారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం హెచ్‌ఆర్‌ఎస్ భాగస్వామ్యంతో పరిశోధన, శిక్షణ, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన నూతన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. అలాగే కొబ్బరి ఒలిచే ప్రక్రియలో ఆధునిక యంత్రాల వినియోగం, సోలార్ డీ-హస్కింగ్ యంత్రాల ఆధునీకరణపై దృష్టి సారించాలని తెలిపారు. హెచ్‌ఆర్‌ఎస్ ప్రాంగణంలో అందుబాటులో ఉన్న భూమిని గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధన, పరిశ్రమల భాగస్వామ్యానికి అనుగుణంగా తగిన ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.

కొబ్బరి, కాయర్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో ప్రతిపాదించిన సాంకేతిక అంశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియో లింకులు, పూర్తి గణాంకాలు, పరిశోధన వివరాలు, మార్కెట్ అవకాశాలను పొందుపరచాలని తెలిపారు.

స్థానికంగా లభించే కొబ్బరి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని విస్తరించడం, అంతర్జాతీయ మార్కెట్లలో కోనసీమ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, అవసరమైన సమాచారాన్ని సేకరించి, సమగ్ర ప్రతిపాదనలతో తుది ప్రాజెక్టు నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.ఈ సమావేశంలో ఉద్యాన శాఖ జెడి. బీవీ రమణ, ఉద్యాన శాఖ  అధికారి ఎం దిలీప్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు