కనకదుర్గమ్మ వారికి బంగారపు బొట్టు బహుకరణ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆలమూరు నాగుల చెరువు గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి రాష్ట్ర బీసీ ఎంప్లాయిస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం, మంగాదేవి దంపతుల కుమార్తె, అల్లుడు అమెరికా వాస్తవ్యులు కాకి గౌతమ్, పావనీసుధా దంపతులు రూ.50వేల విలువైన బంగారు బొట్టును మహర్నవమి సందర్భంగా సోమవారం అందజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు అమ్మవారికి బంగారుబొట్టును అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వారికి వేదమంత్రోత్సవాల మధ్య ఆశీర్వచనాలు అందజేసి అభినందించారు .