BREAKING
జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు గోడౌన్ల వద్ద ప్రతిష్ట భద్రతా చర్యలు --- కలెక్టర్ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ నేడు సీఎం కు ‘ఆర్యదాన్ ముహమ్మ‌ద్‌’ అవార్డు ప్రదానం శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ఈవోగా నూతలపాటి శ్రీధర్ నాయుడు సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహాలు: రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశం నెల్లూరు అపోలో హాస్పిటల్లోఅరుదైన శస్త్రచికిత్స===700 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువు నారాయణ మెడికల్ కాలేజీలో ఘనంగా 57వ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ డే ఉత్తరాఖండ్‌లో భూ కుంభకోణాలపై ఉక్కుపాదం: ఎనిమిది కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లకు గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ ఆదేశం త్వరలోనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై జీవో--- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమిళనాడులో ఐపీఎస్ అధికారుల స్వల్ప బదిలీ: శాంతిభద్రతల విభాగంలో కీలక మార్పులు తాడేపల్లిగూడెం సందర్శించిన ఎమ్మెల్యే బలిశెట్టి కలెక్టర్ నాగరాణి దేశవిదేశాల్లో ఘనంగా ఆయుర్వేద దినోత్సవం: 'ఆయుష్ విజన్ 2030' నివేదికను ఆవిష్కరించిన కేంద్రం

కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్ కు నూతన సెక్రటరీలు

Select Suryaa Now
కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్ కు నూతన సెక్రటరీలు

కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్‌కు నూతన సెక్రటరీలు

ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.శ్రీనివాస్

అడ్మిన్ సెక్రటరీగా వి.పి.ఎస్‌.ఎస్‌.కుమారి

గురువారం బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు

నేడు జిల్లా సెలక్షన్స్ షెడ్యూల్ విడుదల

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
(కాకినాడ)

 కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వాకలపూడి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఎస్‌ఏ (పీఈ) పి.శ్రీనివాస్, అడ్మిన్ సెక్రటరీగా పిఠాపురం బీఎంఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్‌ఏ (పీఈ) వి.పి.ఎస్‌.ఎస్‌.కుమారి నియమితులయ్యారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నెల 17న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వీరిద్దరూ గురువారం బాధ్యతలు స్వీకరించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తెలిపారు.

జిల్లా క్రీడల నిర్వహణ బాధ్యత

2026–27 విద్యా సంవత్సరానికి అండర్-14, అండర్-17 విభాగాల్లో స్కూల్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి వీరు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు, ఎంపిక ప్రక్రియ నిర్వహణతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపికను సమన్వయం చేయనున్నారు.

జాతీయ క్యాలెండర్‌కు అనుగుణంగా..

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ క్యాలెండర్ విడుదలైన నేపథ్యంలో దానికి అనుగుణంగా జిల్లాలో ఎంపిక పోటీల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని డీఈవో పి.రమేష్ నూతన సెక్రటరీలను ఆదేశించారు.

నేడు సెలక్షన్స్ షెడ్యూల్

జిల్లాలో వివిధ క్రీడలకు ఎంపికలు ఎప్పుడు నిర్వహించాలి, పోటీల నిర్వహణ ఎలా ఉండాలనే అంశాలతో షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. జిల్లా సెలక్షన్స్ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు డీఈవో తెలిపారు.