జల దిగ్బంధంలో పలు గ్రామాలు
పాలకొండ, మేజర్ న్యూస్
ఆర్నబ్ తుఫాను దాటికి
మండల పరిధిలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వోని గ్రామానికి వెళ్తున్న మార్గమధ్యంలో కాజ్ వే వంతెనపైనుండి వరదనీరు ఉదృతంగా ప్రవహించడంతో వోని, గుడివాడ, కోటిపల్లి పలుగ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
పట్టణానికి రావడానికి ఉన్న ప్రధానరహదారి జలమయం కావడంతో నిత్యావసర సరుకులకు సైతం గ్రామస్తులు అవస్థలుపడుతున్నారు. ప్రవాహాన్ని పరిశీలించేందుకు స్థానిక ఎంపీడిఓ గ్రామ పరిసరాలకు చేరుకొని వరద ఉదృతి తగ్గేంతవరకు ప్రజలు బైటకు రావొద్దని ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తానని గ్రామస్తులకు తెలిపారు.
మండలంలోని లుంబూరు గ్రామంలో ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునగడంతో కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని కాపాడాలని కోరుతున్నారు.లుంబూరు గ్రామాన్ని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్ స్వయం గా ట్రాక్టర్ పై గ్రామం అంతా తిరిగి పరిశీలించారు.ఈయన తో పాటు డిప్యుటీ తహసీల్దార్ రమేష్, ఆర్ ఐ మహేష్ వున్నారు.అలాగే మండలం లో పలు గ్రామాలో వరద నీరు చేరి పంటలు పూర్తిగా నాశనం అయ్యినట్లు రైతులు తెలిపారు.