జడ్పిటిసి గా ఎన్నికైన రేవతికి ప్రశంసల జల్లు
పూసపాటిరేగ, సూర్య : కూటమి ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ తరఫున జడ్పిటిసి గా విజయదుందుభి మ్రోగించిన కోట్ల రేవతికి నాయకులనుంచి ప్రశంసల జల్లు మిన్నంటతునే ఉన్నాయి. ఆదివారం రాత్రి 9:30 కు అధికార ఫలితం వెలువడడంతో లిండి కళాశాల నుంచి బయటకు జడ్పిటిసిగా ఎన్నికైన రేవతి, రఘు దంపతులు కూటమి నాయకులతో పాటు వైకాపాకు చెందిన నాయకులు కూడా అభినందించారు. జడ్పిటిసి గా ఎన్నికైన రేవతి దంపతులను కొప్పెర్ల జాతీయ రహదారి నుంచి వారి స్వగ్రామమైన కొవ్వాడ వరకు నాయకులు భారీ ఎత్తున భాజా భజంత్రీలతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించి కోట్ల దంపతులపై పూలవర్షం కురిపించారు. రేవతి స్వగృహంలో మండలంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా రేవతి దంపతులను కలిసి శుభాభినందనలను తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాయకులు తాకిడి అధికం కావడంతో జడ్పిటిసి స్వగృహం కిక్కిరిసిపోయింది. రేవతి దంపతులను గజమాలలతో పాటు బొకేలతో అభినందించి శుభాభినందనలను తెలిపారు. విజయ కేతనం అందుకున్న రఘు దంపతులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని మర్యాదపూర్వకంగా క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జడ్పిటిసిగా మరింత గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జడ్పిటిసి దంపతులకు మార్గ నిర్దేశం చేశారు.