BREAKING
నిమజ్జనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుని మృతి ఎన్నికల నిర్వహణలో ఏఐ సాంకేతికత: ప్రక్రియను మరింత సమర్థవంతంగా మారుస్తామన్న కేరళ సీఈవో ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత సర్ఫర్లు: తొలి రౌండ్ హీట్స్‌లో నిరాశపరిచిన షుగర్ శాంతి, కమలి లోకాయన్ 26 యాత్రలో ఐఎన్ఎస్ సుదర్శిని విన్యాసాలు ఐరాస వేదికగా దౌత్యపరమైన మంతనాలు: విదేశాంగ మంత్రులతో అంతర్జాతీయ పరిణామాలపై ఎస్. జైశంకర్ చర్చలు హిమాలయ వాతావరణ మార్పుల ముప్పుపై భారత్, చైనాలతో త్రైపాక్షిక కూటమి: నేపాల్ ప్రధాని కీలక ప్రతిపాదన ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత్‌కు ఖాయమైన పతకం: మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన జోష్న చిన్నప్ప-వెలవన్ సెంథిల్‌కుమార్ జోడీ తిరుమలలో వసతి గదుల లభ్యత వివరాలు: ₹50, ₹100 గదులు 268 ఖాళీ.. టీటీడీ అధికారిక బులెటిన్ విడుదల ది ప్యారడైజ్ బాక్సాఫీస్ సునామీ.. దసరా, హిట్ 3 రికార్డులను బద్దలు కొట్టిన నాని సినిమా! బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు.. నరేశ్‌కు అన్యాయం, హౌస్‌లో భారీ గొడవలు! బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొత్త రికార్డులు.. ఈసారైనా ఆ సరికొత్త మార్కు దాటుతుందా? అమెరికా ఆంక్షల దెబ్బ సరిహద్దుల రక్షణే కాకుండా నూతన సవాళ్లను ఎదుర్కొనేలా జాతీయ భద్రత కందివనంలో దారుణం ఆలస్యమైనా సమయానికే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం: సీపీ సజ్జనార్ స్పష్టీకరణ

హెల్మెట్‌ తప్పనిసరి.. నిబంధనలు పాటించాలి వాహనదారుల భద్రతే లక్ష్యం వల్లూరు ఎస్సై సూర్యనారాయణ రెడ్డి

Select Suryaa Now
హెల్మెట్‌ తప్పనిసరి.. నిబంధనలు పాటించాలి  వాహనదారుల భద్రతే లక్ష్యం  వల్లూరు ఎస్సై సూర్యనారాయణ రెడ్డి

హెల్మెట్‌ తప్పనిసరి.. నిబంధనలు పాటించాలి

వాహనదారుల భద్రతే లక్ష్యం

వల్లూరు ఎస్సై సూర్యనారాయణ రెడ్డి


వల్లూరు మేజర్ న్యూస్

వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ, తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని వల్లూరు ఎస్సై సూర్యనారాయణ రెడ్డి సూచించారు. కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండల పరిధిలోని ఏ. ఓబయపల్లి బస్‌స్టాండ్‌ వద్ద బుధవారం ఎస్సై సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రాణ రక్షణకు హెల్మెట్‌ అత్యంత కీలకం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్‌ ధరించి, దానిని సరిగా బిగించుకొని వాహనం నడపాలని ఎస్సై సూచించారు. హెల్మెట్‌ కేవలం పోలీసుల తనిఖీలకు భయపడి ధరించేది కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు. వాహనంపై ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించడం ద్వారా తలకు తీవ్ర గాయాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనం నడిపే వ్యక్తి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, ప్రతి వాహనానికి నమోదు ధ్రువపత్రం (ఆర్‌సీ), బీమా పత్రం, రహదారి పన్ను తదితర అవసరమైన ధ్రువపత్రాలు ఉండాలని తెలిపారు. వాహనాన్ని నడిపే ముందు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. తనిఖీల సందర్భంగా అవసరమైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించినట్లు ఎస్సై తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వంటి చర్యలకు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచించారు. ప్రతి వాహనదారుడు తన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణాల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తుంటారు. కాబట్టి తొందరపడకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనం నడిపి సురక్షితంగా ఇంటికి చేరాలని ఎస్సై సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాహన నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..