BREAKING
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం

గురుకుల బాలికల పాఠశాలలో నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక

Select Suryaa Now
గురుకుల బాలికల పాఠశాలలో నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక

లక్క వరపు కోట , సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ :జమ్మదేవిపేట గ్రామ కేంద్రంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో 2026 సంవత్సరానికి సంబంధించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ యు. విజయ్ కుమార్ పాత్రో అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో పాఠశాలను ఒక యూనిట్‌గా పరిగణించి, 5వ తరగతి నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వరకు ప్రతి తరగతి నుంచి ఒక పేరెంట్‌ను సభ్యునిగా ప్రత్యక్ష పద్ధతిలో, చేతులెత్తే విధానం ద్వారా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియలో మొత్తం 13 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
అనంతరం ఎన్నికైన 13 మంది సభ్యులు తమలో ఆవాల గణేష్‌ను చైర్మన్‌గా, కుమ్మోజు ఉదయ కుమారిని వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన తొలి సమావేశంలో పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు తీర్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను ప్రిన్సిపాల్ యు. విజయ్ కుమార్ పాత్రో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.