BREAKING
మెగాస్టార్ చిరంజీవితో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ భేటీ.. రెండున్నర గంటల పాటు పవర్‌ఫుల్ నరేషన్! 21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత*

గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా ఆధునిక వైద్య సేవలు

Select Suryaa Now
గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా ఆధునిక వైద్య సేవలు

సూర్య ఒంగోలు.
ప్రకాశం జిల్లాలో తొలి విడతగా 14 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ – విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ప్రారంభం.
ప్రకాశం జిల్లాలో గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రస్థాయిలో 2006 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
అనంతరం ప్రకాశం జిల్లా పీజీఆర్‌ఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, జిల్లాలో తొలి విడతగా 14 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ కావడానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రజల ఇంటి ముంగిటకే ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రజలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను సద్వినియోగం చేసుకొని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను పొందాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో తొలి విడతగా 14 కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అనగా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ తోను ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తారని వారు తెలిపారు. వీరు మాతాజీ సంరక్షణ సేవలు, వ్యాధినిరోధక టీకాలు, బిపి, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి వాటికి మానసిక సంబంధ వ్యాధులకు రిఫరల్ సేవలు చికిత్సలు అందిస్తారని యోగ వంటి నైపుణ్యాలను సైతం ప్రజలకు నేర్పిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్, ప్రోగ్రాం అధికారులు బి. శ్రావణ్ కుమార్, డాక్టర్ ఎస్.కె. నబి , పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఎన్ హెచ్ ఎం డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అధికారి సుబ్బలక్ష్మి, ప్రకాశం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి సుమన, కందుకూరి డివిజన్ ఈఈ కె కొండేపి డివిజన్ ఇంజనీర్ జై బాబు, ఒంగోలు ఏకేవీ ప్రసాద్, ఒంగోలు జేఈ ఎన్ రామ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస మీడియా అధికారి బి నరసింహారావు, డిప్యూటీ డెమో కె.ఏ రాజు ప్రోగ్రాం అధికారులు, ఎపిడమిక్ సెక్షన్ పర్యవేక్షకులు ఎం మోహన్, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.