గరివిడిలో 45 పాఠశాల ల్లో ఏకగ్రీవం...కోరం లేక మూడు పాఠశాలలో ఎన్నికలు వాయిదా
చీపురుపల్లి మేజర్ న్యూస్: గరివిడి మండలంలో బుధవారం జరిగిన పాఠశాల కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 62 పాఠశాలల్లో 59 పాఠశాలలకు కమిటీలు ఏర్పడగా, కోరం లేక బొండపల్లి, అర్థమూరు, రేగటి అగ్రహారం మూడు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 45 పాఠశాలల్లోఎన్నికలు ఏకగ్రీవం కాగా 14 పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారులు పోలుబోతు రామారావు, దుర్గాసి అప్పన్న ల పర్యవేక్షణలో స్కూల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఆయా ఎన్నికల్లో చైర్మన్ ,వైస్ చైర్మన్ గా ఎన్నికైన వారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.