గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయ దుకాణాలు బంద్ బంద్
ఆళ్లగడ్డలో రేపు అనగా శుక్రవారంమాంస విక్రయాలు బంద్.. కమిషనర్
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
పట్టణంలో రేపు మహాత్మా గాంధీ
జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో మాంస విక్రయాలు బంద్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిశోర్ గురువారం తెలిపారు. శాంతి అహింసలను గౌరవిస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు మాంస దుకాణాలకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.