గడ్డమణుగు రవికుమార్ నివాసంలో పోలవరం నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశం
జీలుగుమిల్లి సూర్య న్యూస్: ఎంపీటీసీ, జడ్పిటిసి ,గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సందర్బంగా జీలుగుమిల్లిలో జనసేన సీనియర్ నాయకులు గడ్డమణుగు రవికుమార్ నివాసంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పోలవరం నియోజకవర్గం అబ్జర్వర్ కోళ్ల నాగేశ్వరావు, ఏపీ ట్రైకర్ చైర్మన్ టీడీపీ ఇంచార్జి బోరగం శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సభ్యులు కరాటం సాయి, జిల్లా కార్యదర్శి ద్వారకాతిరుమల స్టేట్ ట్రస్ట్ బోర్డు స్పెషల్ ఇన్వాటివ్ గడ్డమణుగు రవి కుమార్, జీలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము తో పాటు ఏడు మండలాల పార్టీల అధ్యక్షులు ముఖ్యనాయకులతో ఈ సమావేశం జరిగింది. దీనిపై ఇరుపార్టీ వాళ్ళు ముఖ్య నాయకులతో కార్యకర్తలతో ఆలోచించి అభ్యర్థులను ఎంచుకునే నిర్ణయం తీసుకుంటామని సమావేశం లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రిపోర్టర్:బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,