BREAKING
21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత* చిరు వ్యాపారులకు అండగా కేడీసీసీ బ్యాంక్ పెనుగంచిప్రోలులో 17 మందికి రుణ చెక్కుల పంపిణీ ఎలాంటి షూరిటీ లేకుండా రుణ సదుపాయం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం హాజరు

ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా ఆచార్య ఎ. పల్లవి

Select Suryaa Now
ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా ఆచార్య ఎ. పల్లవి

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య :  ఆంధ్రవిశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా ఆచార్య ఎ. పల్లవిని నియమిస్తూ ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు అందజేసి ఆచార్య పల్లవికి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య ఎ. పల్లవి మాట్లాడుతూ తనను డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నియమించినందుకు వీసీ ఆచార్య రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. వ్యాయామ విద్యా విభాగంలో మంచి స్పూర్తితో సేవలు అందిస్తానన్నారు. వర్సిటి క్రీడలు అభివృద్ధి, చేయడంతో పాటు అన్ని క్రీడాంశాల్లో ఇంటర్ కాలిజియట్ పోటీలు విద్యార్థులను పాల్గొనే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలా గే యూనివర్శిటి క్రీడా జట్లు కు ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి క్రీడల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏయూ ఆచార్యులు నన్నయ యూనివర్శిటీ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య సుధాకర్, చీఫ్ వార్డెన్ ఆచార్య సిద్దయ్య, ఏయూ కోపరేటివ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్బాడీ తోపాటు కోడి రామమూర్తి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.ఎస్. వర్మ, గొన్నా కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ సీ ఎచ్. సత్యనారాయణ, డాక్టర్ వి.ఎస్. కృష్ణా డిగ్రీ, పీజీ కళాశాల పూర్వ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ సంధ్యారాణి, పీడీ పోలిరెడ్డి, విధ ఎఫిలియేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు, ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ వై. శ్రీనివాస్, జ్యోతి, హరి, దిలీప్, వ్యాయామ విద్యా విభాగం సిబ్బంది నాగరాజు, శంకర్, మదీనా తదితరులు అభినందనలు తెలిపారు.

 

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.