ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛను పంపిణీ .
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన టిడిపి నాయకులు
రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాల మేరకు మండల టిడిపి నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఇండ్ల వద్దకే వెళ్లి కూటమి నాయకులు భరోసా పింఛన్లను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ వై నాగరాజు, పేపర్ శ్రీనివాసులు, పూజారి అక్కలప్ప తదితరులు పాల్గొన్నారు.