ఎన్ సీ సి కి అర్హత సాధించిన లోటస్ విద్యార్థులు
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; లోటస్ హైస్కూల్ లో 8,9వ తరగతులకు చెందిన 25 మంది విద్యార్థులు ఎన్.సి.సి విభాగంలో ప్రతిభ కనబరిచిన ఎంపికయ్యారు. ఏలూరు ఎన్.సి.సి ఆఫీసర్లు అప్పు మరియు రాహుల్ పటేల్ పాఠశాలలో విద్యార్థుల దేహదార్డ్య, శారీరక సామర్థ్య పరీక్షలను నిర్వహించి ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఎంపికైన వారిలో 10 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బి. దేవి ప్రియ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు త్వరలోనే ఎన్.సి.సి శిక్షణ తరగతులు మరియు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఎన్.సి.సి ఎంతో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఎన్.సి.సి కి ఎంపికైన విద్యార్థులను, లోటస్ హైస్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి శిక్షణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు
రిపోర్టర్.శ్రీనివాస్ . తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా