*ఈవిఎం ల భద్రతకు సంబంధించి పటిష్టమైన నిఘా ఉండాలి*
*ఈవిఎం ల భద్రతకు సంబంధించి పటిష్టమైన నిఘా ఉండాలి*
*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, సెప్టెంబర్ 24:- ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవిఎమ్ గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఈవిఎమ్ గోడౌన్ ను పరిశీలిస్తూ ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలన్నారు. ఈవిఎం లకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, ఎంట్రీ ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల విభాగం, భద్రతా సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు..
కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరిoటెండెంట్ మురళి, బి.జె.పి పార్టీ తరుపున సాయి ప్రదీప్, వైఎస్ఆర్సిపి పార్టీ తరుపున శ్రావణ్ కుమార్, బి.ఎస్.పి పార్టీ తరుపున అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.