డ్రైవర్లకు కనీస వేతనం అమలు చేయాలి
ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, అటెండర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆ సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులు ఉమాపతి కే సెల్వరాజ్ డిమాండ్ చేశారు. యశోద నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానించారు.
నూతన కమిటీ ఎన్నిక
ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా 45 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో 15 మంది ఆఫీస్ బేరర్లు, 30 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. నూతన కమిటీలోగౌరవాధ్యక్షులుగా ఎస్.జయచంద్రగౌరవ సలహాదారుగా బి. శివప్రసాద్ ఆధ్యక్షులుగా ఉమాపతి, ప్రధాన కార్యదర్శిగా కె.సెల్వరాజు, కోశాధికారిగా ఎ.సురేష్, ఉపాధ్యక్షులుగా చెంగల్ రాయలు, సుబ్రహ్మణ్యం, సునంద కుమార్, మనోహర్, సురేష్,సహాయ కార్యదర్శులుగా గోపి, ప్రసాద్, శివప్రసాద్, బుచ్చిరాజు, శ్రావణ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.