దూదేకుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలవాలి
*దూదేకుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలవాలి*
*ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు దూదేకుల కేర్ ఫోర్స్ నాయకుల వినతిపత్రం
ఫోటో. వినతి పత్రం అందిస్తున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
నియోజకవర్గంలోని దూదేకుల సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కోరుతూ, ఈరోజు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ కి (దూదేకుల కేర్ ఫోర్స్) నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దూదేకుల సామాజిక వర్గానికి రావాల్సిన కార్పొరేషన్ నిధులను మంజూరు చేయాలని, అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా తరతరాలుగా వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న దూదేకుల కుటుంబాలకు వృత్తిపరంగా అవసరమైన పనిముట్లు, మెటీరియల్స్, ఆర్థిక సహకారం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.దూదేకుల సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన గుర్తింపు కల్పించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యతతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో దూదేకుల వారికి న్యాయం జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఈ సమస్యలు మరియు డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి దూదేకుల సామాజిక వర్గానికి అన్ని విధాల ఆదుకోవాలని వారు కోరారు .
ఈ కార్యక్రమంలో దూదేకుల కేర్ ఫోర్స్ జిల్లా కో ఆర్డినేటర్ దూదేకుల అహమ్మద్, ఆళ్లగడ్డ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దూదేకుల కొట్లో బాబు, ఆళ్లగడ్డ టౌన్ నాయకులు దూదేకుల దత్తు, ఉయ్యాలవాడ మండల కో ఆర్డినేటర్ కొట్లో అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు.