BREAKING
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన: రాజస్థాన్‌లోని కోటాలో ముగ్గురు నిందితుల అరెస్ట్.. ముంబై క్రైమ్ బ్రాంచ్ అదుపులో దుండగులు! కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన. సేవా కార్యక్రమాల్లో జై భవానీ యూత్ ముందంజ ఖాజీపేట ఎంపీటీసీ స్థానానికి సిద్ధం ఆసియా రిఫైనరీల కష్టాలు లిండ్ట్ అండ్ స్ప్రంగ్లీ సీఈఓ లెక్నర్ రాజీనామా మహిషాసురమర్ధిని గా...దర్శనమిచ్చిన అమ్మవారు యువకుడి దారుణ హత్య వాహన తనిఖీలను ముమ్మరం చేసిన ఏపిఎస్పీ బలగాలు సమాజం నమ్మకపోయినా మనపై మనకు నమ్మకం ఉండటమే అసలైన శక్తి.. దసరా వేళ రియా చక్రవర్తి భావోద్వేగ వ్యాఖ్యలు! అమెరికా మధ్యంతర ఎన్నికల వ్యూహం ఏఐ ఒక్కటే ఆసియా మార్కెట్లకు ఆధారం కాదు చల్లూరులో ఫ్లెక్సీ చించివేతతో రాజకీయ దుమారం! ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు ఆర్థో విభాగంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న వైద్యులు, సిబ్బంది ఆస్ట్రేలియా కార్పొరేట్ రంగంలో భారీ డీల్

డాక్టర్ విక్రమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ అనంతపురం నగర రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతున్న రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీలు

Select Suryaa Now
డాక్టర్ విక్రమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్  అనంతపురం నగర రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతున్న రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీలు

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి చిట్లూర్ రమేష్ గౌడ్ డాక్టర్ విక్రమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయంగా పలకరించుకుని, పలు అంశాలపై చర్చించుకున్నారు.

మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో నగరంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్ నాయకులను కలుస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. డాక్టర్ విక్రమ్‌తో జరిగిన ఈ భేటీలో ఆయన సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రానున్న నగరపాలక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని రమేష్ గౌడ్ విశ్వాసంతో ఉన్నారు. ఈ వరుస భేటీలు అనంతపురం నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.