చెస్ పోటీల్లో ఎస్ ఆర్ జె డిగ్రీ కాలేజీ విద్యార్థిని ప్రతిభ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : కావలి జవహార్ భారతి కళాశాల లో శనివారం జరిగిన విక్రమ సింహపు విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల స్త్రీల చెస్ చాంపియన్ షిప్ పోటీలలో స్థానిక డాక్టర్ యస్ ఆర్ జె డిగ్రీ కళాశాల లో ద్వితీయ సంవత్సరం బిఏ చదువుతున్న విద్యార్థిని గజరాజు సారా సిరా ఏంజెల్ ప్రధమ స్థానం సాధించి చాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్
గోళ్ళ వరకుమారి, పిడి సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్ డి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు అభినందించారు.