చెప్పాం.. చేస్తున్నాం పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు
నరసరావుపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చెప్పాం.చేస్తున్నాం పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి.