బద్వేల్ మున్సిపాలిటీ 39 వ వార్డులో టిడిపి అభ్యర్థి ఘన విజయం
టిడిపి అభ్యర్థికి 372 ఓట్ల మెజారిటీ
బద్వేల్ మేజర్ న్యూస్.. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో జరిగిన స్థానిక సంస్థల్లో భాగంగా 39 వ వార్డులో జరిగిన ఎన్నికలలో మొత్తం 1642 ఓట్ల గాను 1320 పోలవగా టిడిపి అభ్యర్థి తుడిమెళ్ళ విజయలక్ష్మి తన ప్రత్యర్థి జనసేన అభ్యర్థి పై 372 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడముతో వార్డులోని సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అభ్యర్థులే గెలిపించాలని దృఢ సంకల్పంతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అత్యంత అత్యధిక మెజార్టీతో గెలిపించిన వార్డు ప్రజలు రుణం తీర్చుకోలేను అన్నారు . నాపై నమ్మకం ఉంచి మెజార్టీతో గెలిపించిన వార్డు సభ్యులకు తమ వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను ఏలూరు పాటు లేకుండా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. నా గెలుపు కృషిచేసిన టిడిపి నాయకులకు కార్యకర్తలకు వార్డులోని ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రిపోర్టర్.. బద్వేల్ ఇంచార్జ్ రవికుమార్ కడప జిల్లా