బాలికలు విద్యు తో పాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన
బాలికలు విద్యతో పాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
భీమవరం, సెప్టెంబర్ 24: బాలికలు విద్యతో పాటు వ్యక్తిగత సంరక్షణ, భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం భీమవరం నరసయ్య అగ్రహారంలోని బీసీ సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.వసతిగృహంలోని పరిసరాలు, వంటశాల, భోజనం, మౌలిక వసతులను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుతూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
బాలికలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వేధింపులు లేదా అపరిచితుల నుంచి ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఎ.వి. సూరిబాబు, భీమవరం వన్‌టౌనసీఐ ఎ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా భీమవరం ఇన్చార్జి శ్రీనివాస్