BREAKING
నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు ఫిఫా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్పెయిన్ దూకుడు అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు. నెట్‌ఫ్లిక్స్‌లో పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ మూవీ రివ్యూ.. కథ బాగున్నా థ్రిల్ మిస్ అయిందా? మానసిక ఆరోగ్యంపై రాజమహేంద్రవరం జీఎంసీలో అవగాహన సదస్సు, ర్యాలీ ప్రజాసేవ నుంచి పంచాయతీ పీఠం దిశగా ఏలూరి మాధవరావు బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం!

అర్హత మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకో.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి రూప్ కుమార్ యాదవ్ కౌంటర్

Select Suryaa Now
అర్హత మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకో.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి రూప్ కుమార్ యాదవ్ కౌంటర్

 కార్పొరేషన్ రూపాయి వాడినట్లు నిరూపిస్తే ఛాలెంజ్.. సవాల్ విసిరిన రూప్ కుమార్ యాదవ్
 రిజర్వేషన్లు రాకుండానే క్యాండిడేటా? వైఎస్సార్సీపీ రాజకీయ అపరిపక్వతపై విమర్శలు..
 గతంలో వైఎస్సార్సీపీ హయాంలోనే  నందన్‌కు పదవులు ఇచ్చినట్లు గుర్తుచేసిన రూప్ కుమార్
 ఎన్నికల వేళ బీసీ గర్జనలు అంటూ వైఎస్సార్సీపీ మళ్లీ నాటకాలు ఆడుతోంది: రూప్

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్  :    నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి చేసిన విమర్శలకు రూప్ కుమార్ యాదవ్ ఘాటుగా సమాధానమిచ్చారు.కమిషనర్ గారి నియామకం, ఆయన అర్హతలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డికి అసలు అర్హతల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని రూప్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇదే  నందన్ గారిని నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా నియమించింది నిజం కాదా అని నిలదీశారు.అంతేకాకుండా, అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా వైఎస్సార్ కడపకు వైస్ ఛైర్మన్‌గా కూడా రెండేళ్ల పాటు ఇదే నందన్ గారు పనిచేశారని గుర్తుచేశారు.అప్పట్లో చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో లేకపోవడం వల్లే ఈ విషయాలు తెలియలేదని, నోటికొచ్చినట్లు మాట్లాడకుండా తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.కమిషనర్‌గా ఎవరిని నియమించాలి, ఎవరితో పనిచేయించుకోవాలనేది ప్రభుత్వ ఇష్టమని, నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలకు నచ్చినట్లు అధికారులను నియమించాలంటే ఈ ప్రభుత్వంలో కుదరదని తేల్చిచెప్పారు. గ్రూప్-1 సాధించి ఉన్నత చదువులు చదివిన ఒక అధికారిపై ఇలాంటి విమర్శలు చేయడం తగదని, కమిషనర్ గారి పనితీరును నెల్లూరు ప్రజలు చూస్తున్నారని తెలిపారు.మంత్రి నారాయణ గారిపై ప్రతీసారీ విఆర్ హై స్కూళ్లు, బస్సులు, చెట్లు, కాంపాక్టర్లు, స్వీపింగ్ మెషిన్లు అంటూ ఒకే రకమైన పాత విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఉదయం కూడా బాలాజీ నగర్‌లోని ఎంఎస్ఎం హైస్కూల్ అభివృద్ధికి 10 కోట్ల అంచనాతో నారాయణ గారు శంకుస్థాపన చేశారని వివరించారు. నెల్లూరు నగరంలోని ప్రతీ ప్రభుత్వ హైస్కూల్‌ను దాదాపు 10 కోట్లకు పైగా అంచనాతో, తమకున్న విస్తృత పరిచయాలు, సంబంధాలతో నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు..కార్పొరేషన్ డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా విఆర్ హై స్కూల్‌కే కాకుండా ఏ ప్రభుత్వ స్కూల్‌కూ ఖర్చు పెట్టలేదని స్పష్టం చేశారు.బస్సుల రవాణాకు లేదా అద్దెలకు కార్పొరేషన్ నిధుల నుంచి  లక్ష డ్రా చేసినట్లు నిరూపిస్తే ఏం చెప్పినా చేస్తామని సవాల్ విసిరారు. విఆర్ హై స్కూల్ నిర్వహణ కోసం ప్రతీ నెల నారాయణ గారు తమ సొంత డబ్బులు లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం మీ జీవితంలో ఎప్పుడైనా 20 వేలు అయినా ఖర్చు పెట్టారా అని చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. అక్రమంగా డబ్బులు సంపాదించాల్సిన కర్మ నారాయణ గారి కుటుంబానికి లేదని, సొంత కష్టార్జితాన్ని ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారని కొనియాడారు. కళ్లకు గంతలు కట్టుకోకుండా అభివృద్ధిని చూడాలని, టీవీల్లో పాత టేపులు ప్లే చేయడం కాదని ఎద్దేవా చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకుండానే వైఎస్సార్సీపీ అభ్యర్థిని ప్రకటించడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు.తమ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో రిజర్వేషన్ రాకముందే అభ్యర్థిని ప్రకటించడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఓసీ అభ్యర్థి అని విజయ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పిన వైఎస్సార్సీపీ నేతలు, బీసీ లేదా ఎస్సీ అభ్యర్థుల పేర్లను ఎందుకు ప్రకటించలేదని సూటిగా ప్రశ్నించారు. ఇది బీసీ, ఎస్సీ వర్గాల పట్ల వైఎస్సార్సీపీకి ఉన్న చిన్నచూపేనని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయనే మళ్లీ బీసీలను మోసం చేయడానికి బీసీ గర్జనలు పేరిట నాటకాలాడుతున్నారని ఆరోపించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నారని, ప్రజలంతా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని చెప్పారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెప్పి, కూటమి ప్రభుత్వానికి మరియు నారాయణ గారికి మద్దతుగా స్పష్టమైన తీర్పు ఇస్తారని రూప్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మామిడాల మధు , కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, నాయకులు జహీర్, తిరుమల నాయుడు, మైనుద్దీన్, కువ్వరపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.