BREAKING
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం

అమలాపురం మున్సిపాలిటీకి జాతీయ స్కోచ్ అవార్డు: కమిషనర్ నిర్మల్ కుమార్, సిబ్బందికి ఘన సత్కారం

Select Suryaa Now
అమలాపురం మున్సిపాలిటీకి జాతీయ స్కోచ్ అవార్డు: కమిషనర్ నిర్మల్ కుమార్, సిబ్బందికి ఘన సత్కారం

సూర్యఅమలాపురం మేజర్ న్యూస్ : పట్టణ పరిపాలన, పౌర సేవల విభాగంలో అమలాపురం పురపాలక సంఘం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును సాధించింది. మున్సిపాలిటీ సమర్థవంతమైన పనితీరును గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిన సందర్భంగా స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఘనంగా అభినందన సభను నిర్వహించారు. ఈ వేదికగా మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌తో పాటు మున్సిపల్ సిబ్బందిని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అమలాపురం మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు దక్కడం పట్టణానికే గర్వకారణమని, కమిషనర్ మరియు సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పట్టణ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ అభినందన సభలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మితో పాటు ప్రముఖ నాయకులు గంధం పల్లంరాజు, చిక్కాల గణేష్, పెచ్చేట్టి విజయలక్ష్మి, నల్లా పవన్, నల్లా స్వామి, ఏడిద శ్రీను, సుదా చిన్నా, ఆశెట్టి ఆదిబాబు, బోనం సత్తిబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, సాయి తదితరులు పాల్గొన్నారు. అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తూ అమలాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని నాయకులు ఆకాంక్షించారు.