అమలాపురంలో అత్యాధునిక ఎస్‌ఆర్ గ్రానైట్స్ ప్రారంభం రూ.12 కోట్లతో బైపాస్ రోడ్డులో నూతన షోరూమ్
అమలాపురం అక్టోబరు :గృహ నిర్మాణ రంగానికి నాణ్యమైన గ్రానైట్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో అమలాపురం బైపాస్ రోడ్డులో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్ గ్రానైట్స్, సతీష్ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దాదాపు రూ.12 కోట్ల పెట్టుబడితో అమలాపురానికే తలమానికంగా ఈ గ్రానైట్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి,మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, వైసిపి నాయకులు పినిపే శ్రీకాంత్, వైసిపి సిఇసి సభ్యులు పితాని బాలకృష్ణ, జనసేన నాయకుడు మండేల బాబీ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సంస్థ అధినేత, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను అభినందించారు. పొన్నాడ సతీష్ కుమార్ కుమారులు సుమంత్ రేవంత్ లు ఈ గ్రానైట్స్ వ్యాపారాన్ని చూసుకుంటారని ఆయన తెలిపారు.ఆధునిక గృహాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో గ్రానైట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అత్యాధునిక ప్రదర్శనశాల, విభిన్న డిజైన్లు, రంగులు, నాణ్యమైన గ్రానైట్ ఉత్పత్తులతో వినియోగదారులకు అతి తక్కువ ధరకు మెరుగైన ఎంపికలు అందించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది.
అమలాపురం బైపాస్ రోడ్డులో అందుబాటులోకి వచ్చిన ఈ షోరూమ్ నిర్మాణ రంగానికి సంబంధించిన వినియోగదారులకు ఒకే చోట విభిన్న గ్రానైట్ రకాల ఎంపికకు అవకాశం కల్పించనుంది. ప్రముఖ రాజకీయ నాయకుల హాజరుతో ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా సాగింది. నూతన వ్యాపార సంస్థ విజయవంతంగా అభివృద్ధి చెందాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కజారియా, జాగ్వార్,జాన్సన్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు