ఐదేళ్ల జెడ్పీటీసీ గా మీ సేవలు మరువలేనివి
పోలాకి, సూర్య : ఐదేళ్ల జెడ్పీటీసీ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను డీకేసీ యూత్ ఆధ్వర్యంలో బుధవారం మబగాం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీకేసీ యూత్ సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీగా పదవీకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ప్రజా సమస్యలపై స్పందిస్తూ, యువతకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో పనిచేసిన డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యకు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని డీకేసీ యూత్ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీకేసీ యూత్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.